స్వలింగసంపర్కం పున:సమీక్ష కుదరదన్న సుప్రీంకోర్టు

supస్వలింగ సంపర్కం నేరమేనని సుప్రీంకోర్టు మరోమారు తేల్చి చెప్పింది. గే సెక్స్ నేరమేనన్న తీర్పుపై తిరిగి సమీక్షించేది లేదని తేల్చి చెప్పింది. CRPC 377 చట్టబద్ధమేనని, స్వలింగ సంపర్కం నేరమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పున: సమీక్షను కోరుతూ దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం తో పాటు, నాజ్ ఫౌండేషన్ వారు ఇంకా పలు ఇతర LGBT హక్కుల సంఘాలు ఈ సమీక్ష పిటిషన్లను దాఖలు చేసారు. గతంలో స్వలింగ సంపర్కంపై ఇచ్చిన తీర్పును జస్టిస్ దత్తు, జస్టిస్ ఎస్.జే.ముఖోపాధ్యాయతో కూడిన ధర్మాసనం సమర్ధించింది.

అయితే తమ నిర్ణయం CRPC 377 చట్ట బద్ధత అంశం పైనే కేంద్రీకృతమైందని, అసలా చట్టం ఇప్పటి సమాజానికి అవసరమా, కాదా లాంటి అంశాలు, దానిపై సమాజ దృక్కోణం వంటివి శాసన వ్యవస్థ చర్చించి చట్టంలో మార్పులు చేబట్టవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది.

సుప్రీం నిర్ణయం వివక్షా పూరితమని పోరాడుతున్న LGBT సంఘాల వారికి ఇప్పుడు ఉన్న ఏకైక దారి క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడమే.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy