థ్యాంక్ గాడ్: కుప్పకూలిన స్కూల్.. సెలవు కావడంతో అంతా సేఫ్

చమోలీ: దేవుడా… ఎంతటి ప్రమాదం తప్పిందీ.. అధికారుల ముందు జాగ్రత్త వందల మంది తల్లులకు గుండె కోత తప్పించింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం గోపేశ్వర్ లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి సరస్వతి శిశు మందిర్ పాఠశాల కుప్పకూలింది. అదృష్టం ఏంటంటే ఈ రోజు స్కూలుకు సెలవు కావడమే. ఉత్తరాఖండ్ సహా నార్త్ ఇండియాలో చాలా చోట్ల వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిన్ననే హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని స్కూళ్లకు మంగళవారం సెలవు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ డెసిషన్ ఇవాళ వందల మంది పిల్లల ప్రాణాలను కాపాడింది.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy