పాకిస్థాన్.. కశ్మీర్ ను మరిచిపో : ఆఫ్రిది సలహా

లండన్ : మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది మరోసారి కశ్మీర్ ఇష్యూపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. ఆ దేశ ప్రధానమంత్రి, మాజీ దిగ్గజ క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్ కు కశ్మీర్ వివాదంపై అడ్వైజ్ చేశాడు. లండన్ లోని బ్రిటీష్ పార్లమెంట్ లో విద్యార్థులతో మాట్లాడిన షాహిద్ ఆఫ్రిది.. కశ్మీర్ విషయాన్ని పాకిస్థాన్ మరిచిపోవడం మంచిదని అభిప్రాయపడ్డాడు. కశ్మీర్ వివాదం అనేది.. పాకిస్థాన్, ఇండియాలకు ఓ జబ్బుగా పరిణించిందని అన్నాడు.

కశ్మీర్ కావాలంటూ పాకిస్థాన్ డిమాండ్ చేస్తుండటం కరెక్ట్ కాదన్నాడు షాహిద్ ఆఫ్రిది. పాకిస్థాన్ తన సొంత రాష్ట్రాలను కూడా సరిగా హ్యాండిల్ చేయలేకపోతోందని… ఈ సమయంలో కశ్మీర్ ను అడగడంలో అర్థం లేదని అన్నాడు. “పాకిస్థాన్ కు కశ్మీర్ తో అవసరం లేదు. పాక్.. తన నాలుగు సొంత రాష్ట్రాలను సరిగా హ్యాండిల్ చేయడం లేదు. కశ్మీర్ లో అమాయక ప్రజలు చనిపోతుండటం నాకెంతో బాధ కలిగిస్తోంది” అని ఆఫ్రిది అన్నాడు. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి ఉగ్రవాదులను పాకిస్థానే మోహరిస్తోందని ఇండియా నమ్ముతోందని ఆఫ్రిది చెప్పాడు.

కశ్మీర్ తో పాక్ కు అవసరం లేదు. అలా అని ఇండియాకు ఇవ్వదు. అలాంటప్పుడు కశ్మీర్ కు స్వతంత్రంగా ఓ దేశంగా  ఉండనిద్దాం. ఇలా చేస్తే.. అక్కడుంటున్నవారు చనిపోరు. కనీసం మానవత్వం ఐనా బతికి ఉంటుంది. అక్కడుంటున్నవారి మరణాలు చూస్తే బాధ కలుగుతోంది” అన్నాడు ఆఫ్రిది.

కశ్మీర్ ఇష్యూపై ఆఫ్రిది గతంలోనూ పాకిస్థాన్ కు సపోర్ట్ గా స్పందించాడు. భారత్ ఆధీనంలో ఉన్న కశ్మీర్ లో భయానక, బాధకరమైన పరిస్థితులున్నాయని గతంలో అన్నాడు. స్వపరిపాలన కోరుతున్న వారిని క్రూరంగా చంపేస్తున్నారని… స్థానికుల గొంతు నొక్కుతున్నారని అన్నాడు. ఈ రక్తపాతాన్ని ఆపడానికి ఎవరూ ముందుకు రావడం లేదనీ… ఐక్య రాజ్యసమితి ఏం చేస్తోందని గతంలో ట్వీట్ చేశాడు. ఇప్పుడు తమది కానప్పుడు.. మరొకరికి కూడా దక్కకుండా చేయాలన్న ఉద్దేశం ఆఫ్రిది మాటల్లో వ్యక్తమవుతోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy