వివాదంలో షారూక్ చెడ్డీ ఫొటో… పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

 ఢిల్లీ : బాలీవుడ్ నటుడు ఫారుక్ ఖాన్ నటించిన జీరో సినిమా పోస్టర్ వివాదమైంది. సిక్కుల పవిత్రమైన గట్కా కిర్పన్‌(చిన్న కత్తి)ని మెడలో వేసుకుని పోస్టర్, ట్రైలర్‌ రిలీజ్ చేసారు. ఈ విశయంపై బీజేపీ ఎమ్మెల్యే మన్‌జిందర్‌ సింగ్ సిర్సా ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘పోస్టర్‌, ప్రోమోలో షారుక్‌ చెడ్డీ వేసుకుని, సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే కత్తిని వెటకారంగా మెడలో వేసుకున్నాడు. మా సిక్కులు అలా వెటకారంగా చెడ్డీలు వేసుకుంటారా? కాబట్టి సినిమాలో ఆ సన్నివేశాన్ని తొలగించండి’ అని కోరారు. దీంతో పాటే ఢిల్లీ లోని ఓ పోలీస్ స్టేషన్ లో కేసు వేశారు. దర్శకుడు ఆనంద్‌, షారుక్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా కోరారు. ఈ చిత్రంలో షారుక్‌.. బవ్వా సింగ్‌ అనే మరుగుజ్జు పాత్రలో నటిస్తున్నారు. కత్రినా కైఫ్‌, అనుష్క శర్మ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy