ద్రాక్షపండ్ల జాతర: ఫ్రీగా తినండి.. ఇంటికి తీసుకెళ్లండి

 హైదరాబాద్ లో ద్రాక్షపండ్ల జాతర మొదలైంది. ఏడెకరాల తోటలో కావాల్సినవి కోసుకుని తినొచ్చు. నచ్చినవి ఇంటికి తీసుకుపోవచ్చు. ప్రపంచంలో పండే 59 రకాల ద్రాక్ష పండ్లు ఇక్కడున్నయ్‌! కావాలా? అయితే రాజేంద్రనగర్‌లోని కొండా లక్ష్మణ్‌ బాపూజీ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రండి. ద్రాక్ష పందిళ్లలో తియ్యని రుచులు స్వాగతం పలుకుతున్నాయ్‌.

రాజేంద్రనగర్‌‌‌‌లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ సెంట్రల్‌‌‌‌ హార్టికల్చర్‌‌‌‌ యూనివర్సిటీ ఉంది. ఈ ప్రాంగణంలోని వ్యవసాయ క్షేత్రంలో పరిశోధన కోసం ఏడెకరాలలో ద్రాక్ష సాగు చేస్తున్నారు. సాగు చేసేది ఏడెకరాల్లోనే అయినా ఈ తోటలో పండేది మాత్రం 59 రకాలు! ప్రపంచంలోని అన్ని రకాల ద్రాక్షలు ఇక్కడ పండుతున్నాయ్‌. వీళ్లు పండించేది లాభాల కోసం కాదు. పరిశోధనలు చేసేందుకే సాగు చేస్తున్నారు. ఆ ద్రాక్ష పంట సాగుపై ఆచార్యుల పర్యవేక్షణ ఉంటుంది. వారి ఆధ్వర్యంలో పిహెచ్‌డి విద్యార్థులు పరిశోధనలు చేస్తారు. పంట దిగుమతులు పెంచడానికి పరిశోధనలు చేయడానికి ఈ ద్రాక్ష పంటను సాగు చేస్తున్నారు. ఈ తోట కేవలం పరిశోధనల కోసమే కాదు… మనకోసం కూడానూ. ఇక్కడ ద్రాక్షలను పండిచే విధానాన్ని అక్కడికి వెళ్లి చూడొచ్చు. రకరకాల ద్రాక్షలను రుచి చూడొచ్చు. నచ్చినవాటిని కొనుక్కోవచ్చు.

ఎన్నెన్నో రుచులు
మార్కెట్‌ లో అయిదారు రకాల ద్రాక్ష పండ్లుంటాయి. ఈ ద్రాక్ష పరిశోధన కేంద్రానికి వస్తే పర్పుల్‌‌‌‌, కార్డినల్‌‌‌‌, రెడ్‌ గ్లోప్‌, కిస్మిస్‌ సీడ్‌ లెస్‌, శరద్‌ సీడ్‌ లెస్‌, థామ్సన్‌ సీడ్‌ లెస్‌, గులాబీ బెంగుళూర్ పర్పుల్‌‌‌‌, మెడిక.. ఇలా యాభై తొమ్మిది రకాల ద్రాక్ష పళ్లు ఈ పందిళ్లలో కనువిందు చేస్తున్నాయి. ద్రాక్ష పళ్లను కొనాలనుకునే వాళ్లు తోటంతా తిరగొచ్చు. నోరూరించే ద్రాక్ష పండ్లను రుచి చూడొచ్చు. నచ్చిన టేస్ట్‌‌‌‌వి కావల్సినన్ని కొనుక్కోవచ్చు. మార్కెట్‌ ధరలతో పోల్చితే చాలా తక్కువ. ద్రాక్ష కిలో 80 నుం చి 250 రూపాయల వరకు ఉంది. ఈనెల 27 నుంచి ప్రారంభమైన ద్రాక్ష విక్రయాల మేళా రెండు నెలలు ఉంటుంది. వీకెండ్స్‌ లో ఈ ద్రాక్ష తోట కళకళలాడుతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy