SRSP పునరుజ్జీవంతో నా జన్మ ధన్యమైంది : కేసీఆర్

kcrనిజామాబాద్‌ జిల్లా పోచంపాడులోని శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్ట్‌ పునరుజ్జీవనం కార్యక్రమానికి గురువారం (ఆగస్టు-10) సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. 1996లో ఎస్సారెస్పీ కట్టమీదకు వచ్చి చూస్తే పరిస్థితి దీనంగా కనిపించింది. ఆంధ్రా పాలకులు ఏం చేసినా తమ ప్రాం ప్రయోజనాల ఆశించే చేశారు తప్ప తెలంగాణపై ప్రేమతో కాదు. పరిస్థితులు బాగుపడాలంటే స్వరాష్ట్ర సాధనే మార్గమని ఆనాడే చెప్పాను. రాష్ట్రాన్ని సాధించి తీరుతానని ఎస్సారెస్పీ సాక్షిగా అప్పుడే శపథం చేశాను. ఇన్నాళ్ల తర్వాత రాష్ట్రాన్ని సాధించి ఎస్సారెస్పీకి పునరుజ్జీవనం చేసేందుకు మీ ముందుకొచ్చాను అని తెలిపారు .

2001 లో గులాబీ జెండా ఎగిరిన త‌ర్వాత జ‌ల‌సాధ‌న ఉద్య‌మం చేప‌ట్టామనన్నారు. అప్పుడు ప్రాజెక్టుల రూపు రేఖ‌లు ఎలా ఉన్నాయో కూడా తెలియ‌జేశామని, అనేక పోరాటాల త‌ర్వాత తెలంగాణ సాధించుకున్నామని సీఎం తెలిపారు. నాటి ప్ర‌భుత్వాలు ఇచ్చిన హామీల‌న్నీ మోస‌పూరిత ప్రాజెక్టులే. 1996లో ఓసారి శ్రీరాంసాగ‌ర్ క‌ట్ట చూడటానికి వ‌చ్చిన‌ప్పుడు  తన ఆరోగ్యం సహకరిస్తే తానే తెలంగాణ ఉద్యమం చేపడతానని ఇదే శ్రీరాం సాగర్ కట్టమీద తాను నిర్ణయం తీసుకున్నానని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆంధ్రవాళ్లు ఎన్నడూ కూడా నీళ్లు ఇవ్వలేదు. వరంగల్ లో చెట్లు మొలిచినాయి. కాల్వలు తవ్వి కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకుపోయారు కానీ పనులు చేయలేదన్నారు.పరిస్థితి చూశాక. తెలంగాణ ఉద్య‌మం చేస్తానని.. తెలంగాణ సాధిస్తానని.. గట్టి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

శ్రీరాంసాగ‌ర్ ప్రాజెక్ట్ రూపురేఖ‌లు మార్చాలని  ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోయే నాగార్జున సాగ‌ర్ వైష్ణ‌వాల‌యం లాగా ఉంటే.. తెలంగాణకు నీళ్లిచ్చే శ్రీరాంసాగ‌ర్ శిథిల శివాల‌యంలా మారిందన్నారు. నేడు ఆ మాట‌ను నిజం చేసుకున్న‌దుకు సంతోషంగా ఉందన్నారు. ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నందుకు తన జ‌న్మ ధ‌న్య‌మైందని సంతోషం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే..మొదటిదశలో చెరువల కోసం మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టాం. అతి తక్కువ సమయంలోనే నీళ్ళు తెచ్చే ప్రణాళికలు చేస్తున్నాం. వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ పనులు చేపడుతున్నాం. వర్షాకాలం నుంచి 250 టీఎంసీల నీళ్లు పోయాయి. మోతె గ్రామం పెట్టిన మొగ్గను తాను అన్న కేసీఆర్… వచ్చే సంవత్సరం శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నీళ్లతో నింపుతామన్నారు. దీని ద్వారా గడ్డి పెరుగుతది. పంటలు పండుతాయి. రైతులు ఆనందంగా ఉంటారు. ఆదిలాబాద్ జిల్లాలో వర్షపాతంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి.

శ్రీరాంసాగర్ ద్వారా నిజామాబాద్, నిర్మల్, సూర్యాపేట, నల్గోండ దాకా నీరు చేరుతుంది. బస్వాపూర్, గందమల్ల దాకా నీళ్లు మళ్లిస్తాం. ఆదిలాబాద్ దక్షిణభాగాన్ని ముద్దాడే గోదావరి రైతన్నలకు వరప్రదాయినిగా ఉంటుంది. పోరంబోకు భూములతో అద్భుతమైన పర్యావరణ క్షేత్రంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును తీర్చిదిద్దుతాం. మంచి నీరు కావచ్చు..సాగు నీరు విషయంలో కావచ్చు సిన్సియర్ గా పని  చేస్తా. కాంగ్రెస్ పార్టీ అనవసరంగా పంచాయితీ చేస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తా. కాంగ్రెస్ పార్టీ నాయకులు నీటి ప్రాజెక్టులకు అడ్డుకట్ట వేస్తున్నారు. రాత్రింబవళ్లు కష్టపడి ఇప్పుడు కరెంటు సమస్యలు లేకుండా చేసిన ఘనత టీఆర్ ఎస్ ది.  ప్రజల ఆశీర్వాదం ఉన్నంతవరకు టీఆర్ఎస్ కి తిరుగులేదు. ఉద్యమం చేస్తానని చెప్పిన చోటే ఇప్పుడు సీఎంగా నిలబడి ఉన్నా. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో 40 లక్షల ఎకరాలకు నీళ్లు తెప్పించడంలో మరోసారి కేసీఆర్ మొండితనాన్ని నిరూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.

కాంగ్రెస్‌ నేతలను నిలదీయండి

‘ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేక కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకుండా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్‌ నేతలు పదుల సంఖ్యలో కేసులు వేశారు. ఈ వ్యవహారంపై ప్రజలు తిరగబడి కాంగ్రెస్‌ నేతలను ఎక్కడికక్కడ తిరగబడాలి. సాగునీటి ప్రాజెక్టులకు ఎందుకు అడ్డుపడుతున్నారని నిలదీయాలి’ అని  పిలుపునిచ్చారు కేసీఆర్‌.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy