SRSP పునరుజ్జీవం పనులు ప్రారంభం

KCR-SRSPనిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ  పునరుజ్జీవన పథకం పనులు ప్రారంభించారు సీఎం కేసీఆర్. మెండోరా మండలం పోచంపాడులో… పనులకు కొబ్బరి కాయ కొట్టి శంకుస్థాపన చేశారు. JCBతో మట్టి తీశారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన పైలాన్ ను ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డితో ప్రభుత్వ సలహాదారు వివేకానంద్ పాల్గొన్నారు.

SRSP వరద కాలువ  శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దగ్గర మొదలై  మిడ్ మానేరు ప్రాజెక్టు  వరకు ఉంటుంది. దీని పొడవు 120 కిలోమీటర్లు.  వరద కాలువ  ప్రవాహాన్నే రిజర్వాయర్ గా  వాడుకుంటూ నీళ్లను పైకి రివర్స్ పంపింగ్ చేసి.. శ్రీరాంసాగర్  ప్రాజెక్టులోకి విడుదల చేయాలన్న ఆలోచనతో పునరుజ్జీవన పథకాన్ని డిజైన్ చేశారు. దీని కోసం కాళేశ్వరం ప్రాజెక్టు  నుంచి తెచ్చే నీళ్లనే ఉపయోగిస్తారు. అలాగే కాళేశ్వరం తరహాలోనే రివర్స్ పంపింగ్ చేస్తారు. ఇట్లా SRSP ఆయకట్టుతో పాటు దాని మీద ఆధారపడిన మిగిలిన లిఫ్ట్ లు, స్కీంలు, ఆయకట్టు స్థిరీకరణకు సరిపడా నీళ్లిచ్చే అవకాశం ఉంది.

కాళేశ్వరం ప్రాజెక్టుల భాగంగా.. రివర్స్ పంపింగ్ తో  ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొస్తారు. దీనిలో రెండు టీఎంసీల నీటిని SRSP వరద కాలువ 99వ  కిలోమీటర్ దగ్గర పోస్తారు. ఇవి మిడ్ మానేరు ప్రాజెక్టుకు చేరతాయి. దీంట్లో చిన్న మార్పుచేసి  SRSP వరద కాలువ పునరుజ్జీవన పథకాన్ని రూపొందించారు. 99వ కిలోమీటర్ దగ్గర పోసే రెండు టీఎంసీల నీళ్లల్లో.. ఒక టీఎంసీని  మిడ్ మానేరుకు వదిలి, ఇంకో టీఎంసీని పైకి తీసుకుపోతారు. మూడు దశలలో  రివర్స్ పంపింగ్ తో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పంపించేలా డిజైన్ చేశారు.

వెయ్యి కోట్ల ఖర్చుతో ఈ  పథకాన్ని ప్రారంభిస్తోంది సర్కార్. దీనికి అవసరమయ్యే  భూమి 40 ఎకరాలు మాత్రమే. మూడు దశల  లిఫ్టులకు  కావాల్సిన కరెంట్  156 మెగావాట్లు. దీనికోసం 6.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 8 పంపులు  ఏర్పాటు చేస్తారు. రివర్స్ పంపింగ్ తో పైకి  పంపే నీళ్లతో పాటు.. వరద కాలువలనే ఒకటిన్నర టీఎంసీలదాంక  నీళ్లు నిల్వఉంటాయి. కాలువ సామర్థ్యం 22 వేల క్యూసెక్కులు. దీంతో వరద ఉన్నప్పుడు ఎక్కువ నీళ్లు లిఫ్టు చేసుకునే అవకాశం ఉంది.

శ్రీరాంసాగర్ మీద ఆధారపడిన ఆయకట్టుతో పాటు లిఫ్టులు, స్కీంలకు సరిపడా నీళ్లివ్వాలంటే 95 టీఎంసీలు కావాలి. ఇంత స్థాయిల ప్రాజెక్టుల నీళ్లు ఉండట్లేదు. దీనికి నీళ్లివ్వగలిగితే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. అందుకనే శ్రీరాంసాగర్ వరద కాలువ పునరుజ్జీవన పథకం చేపడుతోంది సర్కార్. గోదావరికి వరద ఉన్నన్ని రోజులు శ్రీరాంసాగర్ కు రివర్స్ పంపింగ్ చేస్తారు. ఒకవేళ శ్రీరాంసాగర్ కే వరద వస్తే.. లిఫ్టును ఆపేస్తారు. దీంతో  రెండు రకాలుగా ప్రయోజనం ఉంటుంది. ఈ స్కీం పూర్తయితే ఉత్తర తెలంగాణకు మరింత మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.

CM KCR Inaugurates SRSP Restoration Scheme

CM #KCR Inaugurates #SRSP Restoration Scheme

V6 News 发布于 2017年8月9日周三

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy