అచ్చు తాతలాగే.. NTR బయోపిక్ లో సుమంత్ స్టిల్ రిలీజ్

హైదరాబాద్ : NTR బయోపిక్ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రను సుమంత్ ఎలా ఉంటాడో అన్న ఆసక్తికి బ్రేక్ పడింది. సుమంత్ అచ్చు తాతలాగే ఉన్నాడు. నందమూరి బాలకృష్ణ.. టైటిల్ రోల్ లో.. సొంతబ్యానర్ పై ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) రూపొందిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ… చంద్రబాబు నాయుడు పాత్రలో రానా స్టిల్స్ ను విడుదలచేయడంతో… సినిమాపై ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ అయ్యింది. ఇపుడు లేటెస్ట్ గా సుమంత్ గెటప్ ను విడుదల చేసింది సినిమా యూనిట్.

అక్కినేని వాయిస్ ను.. యాక్టింగ్ ను పలు సినిమాల్లో ఆయన మనవడు సుమంత్ ఇమిటేట్ చేశాడు. కానీ ఆ పాత్రను ఎప్పుడూ పోషించలేదు. ఈ ఇద్దరు కలిసి.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సంబంధం సినిమాలోనూ కలిసి నటించారు. ఇపుడు మొదటిసారిగా తాత పాత్రలోనే సుమంత్ నటిస్తున్నాడు. ఈ ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్న సుమంత్… తాతపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఇవాళ(సెప్టెంబర్ 20) అక్కినేని నాగేశ్వరరావు 94వ జయంతి కావడంతో… తాతా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు సుమంత్. ఆ రోజుల్లోనే ఏఎన్ఆర్ అచ్చు ఇలాగే ఉండేవారని… అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy