
అసెంబ్లీ వాయిదాల మధ్య కొనసాగుతూ ఉంది. స్పీకర్ విపక్ష నేతల వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని వైసీపీ నేతలు పట్టుబట్టారు. దీంతో సమైక్యాంధ్ర నినాదాలతో వైసీపీ నేతలు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. సభ నిర్వహణకు అడ్డురావద్దని సహకరించాలని స్పీకర్ సభ్యులను కోరారు. ప్రొటెస్ట్ చెప్తానన్న YCP నాయకురాలు విజయమ్మకు అవకాశం ఇచ్చారు స్పీకర్. విజయమ్మ తన అభ్యర్ధన కు పరిమితమై మాట్లాడకుండా వోటింగ్ ఉండాలనీ, 60 సంవత్సరాలుగా కలిసి ఉన్న తెలుగు వారిని విడదీయాల్సిన అవసరం ఏమిటని ఉపన్యసించడంతో నిరసనలు వెల్లువెత్తాయి. మంత్రి ఆనం మాట్లాడుతూ విభజన బీజాలు YS చేతులమీదుగానే పడ్డాయని, YSRCP వారు బయట విభజన వద్దని, మనసులో మాత్రం కావాలని రెండు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. తెరాస నేత KTR కూడా YS తెలంగాణాకు OK అన్న వార్త పేపర్ కటింగ్ చూపించారు. చర్చ కొనసాగుతుంది.