శబరిమల పై ఉన్న ఉత్సాహం.. బాదల్లో ఉన్న ఆడవాళ్ల పై చూపండి : తస్లిమా నస్రిన్

 శబరిమలకు వెళ్ళేందుకు ఉత్సాహం చూపిస్తున్న సామాజిక కార్యకర్త లపై తస్లిమా నస్రిన్ తనదైన విధంగా స్పందించారు. దేశంలోని స్త్రీలు గృహహింస, అత్యాచారం, వేధింపులు, ఆరోగ్యం, ఉద్యోగం, స్వేచ్ఛ వంటి సమస్యలతో సతమతమవుతున్నారని… వాటిపై పోరాడాల్సిన మహిళా కార్యకర్తలు శబరిమల ఆలయ ప్రవేశానికి పట్టుబట్టడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. వీరి పోరాటం గుడులల్లో కాదని గ్రామాల్లో చేయాలని హితవు పలికారు.

తాజాగా.. శబరిమల అయ్యప్ప స్వామిని ఎలాగైనా దర్శించుకు తీరుతానన్న సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌కి కొచి విమానాశ్రయంలో ఆందోళన కారుల నుంచి తీవ్రమైన నిరసనలు ఎదురయ్యాయి. దీంతో తృప్తి దేశాయ్‌ తన బృందంతో తిరిగి పుణె కు వెళ్లిపోయారు. ఆందోళన కారులతో పాటు ట్యాక్సీ  డ్రైవర్లు కూడా తృప్తి దేశాయ్ రాకకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్నారు. ఇదిలావుంటే తాము హిందువుల మనోబావాలను పరిగనలోకి తీసుకోమని సుఫ్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తప్పక అమలు చేస్తామని కెరళా ముఖ్యమంత్రి పినరై విజయన్ అఖిలపక్షసమావేశంలో స్పష్టం చేశారు. శబరిమలలో  అన్ని వయస్కుల మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించాలని సుఫ్రీం కోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy