TRS అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం: కేటీఆర్

తనకు సీఎం కావాలనే కోరిక లేదన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ వస్తే చాలనుకున్నానని, మంత్రిగా అవుతానని కూడా అనుకోలేదన్నారు. అంతేకాదు మంత్రి పదవే తనకు ఎక్కువ అనుకుంటానని… ఇంతకంటే పెద్ద పదవులు చేపట్టాలన్న దురాశ లేదని చెప్పారు.హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో మాట్లాడిన కేటీఆర్… కేసీఆర్ మరో 15 ఏళ్లు సీఎంగా ఉండాలని కోరిక తప్ప మరొకటి లేదన్నారు. ఈ ఎన్నికల్లో TRS అసాధారణ విజయాన్ని సొంతం చేసుకుంటుందన్నారు. తమకు ఎవరి పట్ల సాఫ్టుకార్నర్ లేదని స్పష్టం చేశారు. పలువురు నేతలపై అధికారులు, ప్రజలు ఫిర్యాదు చేసిన టిక్కెట్ ఇచ్చారు కదా అని ప్రశ్నిస్తే.. అది ప్రజలు చూసుకుంటారన్నారు. అంతేకాదు TRS సొంతంగా అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. మళ్లీ మీకు కనిపించనంటూ స్పష్టం చేసిన కేటీఆర్…. తన సవాల్‌ను స్వీకరించే దమ్ము ఉత్తమ్‌కు, ఇతర నేతలకు ఉందా అని ప్రశ్నించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు సార్లు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఏనాడూ కూడా ఒంటరిగా గెలువలేదన్నారు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చాడని గుర్తు చేశారు. చంద్రబాబు జీవితంలో సొంతంగా పోటీ చేయలేదు. టీడీపీ పొత్తు పెట్టుకోని ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని…. మిగతా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని బాబు అధికారంలోకి వచ్చాడన్నారు. చంద్రబాబు స్వయం ప్రకాశం లేని చంద్రుడన్నారు కేటీఆర్.

మాకు రాజకీయ ప్రత్యర్థి మోడీ అన్నారు. బీజేపీ 119 స్థానాల్లో పోటీ చేస్తోందని.. 100 స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతు చేసే పార్టీ TRS అని అన్నారు కేటీఆర్. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 7 సర్వేలు వచ్చాయని… అందులో ఆరు సర్వేలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వచ్చాయన్నారు. అంతేకాదు డిసెంబర్ 11న అసలు సర్వే వస్తుందన్నారు కేటీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy