TRS అధ్యక్ష పదవికి సీఎం తరపున 3 నామినేషన్లు

TRS_Plenaryతెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవి కోసం సీఎం కేసీఆర్ తరపున డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నామినేషన్ వేశారు. తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

మహమూద్ అలీతోపాటు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం తరపున మొత్తం 3 నామినేషన్లు దాఖలు చేయగా.. ఈ నెల 18వతేదీ వరకు నామినేషన్లు తీసుకుంటామని రిటర్నింగ్ అధికారి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. నామినేషన్ పత్రాలను 19న పరిశీలించి.. 20న ఉపసంహరణకు గడువు ఇస్తామన్నారు. అదే రోజు అధ్యక్షుడి పేరును ప్రకటిస్తామన్నారు నాయిని.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy