TRS ప్లీనరీ: 1300 మందితో బందోబస్తు

police-security-trsTRS ప్లీనరీకి సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 1300 మంది సిబ్బందిని భద్రత కోసం మోహరించారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ సారధ్యంలో బాలానగర్ డీసీపీ సాయిశేఖర్ నేతృత్వంలో బందోబస్తును సమీక్షిస్తున్నారు. అదనపు డీసీపీలు-3,ఏసీపీలు-8, ఇన్స్ పెక్టర్లు-38,ఎస్సై, ఏఎసై లు-100, కానిస్టేబుళ్లు-100, TSSP-4 ఫ్లాటూన్ లు బందోబస్తులో పాల్గొంటారు. ప్రధాన వేదిక ప్రగతి ప్రాంగణం దగ్గరకు VVIP పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. సమావేశానికి వచ్చే ప్రతినిధులు తప్పనిసరిగా పాసులను తెచ్చుకోవాలని లేదంటే అనుతించబోమని స్పష్టం చేశారు పోలీసుఉన్నతాధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy