ప్రసవాన్ని వాయిదా వేసుకుని ఓటింగ్ లో పాల్గొన్న MP

 ఇంగ్లండ్‍ ప్రధాని థెరిసా మే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ లో ఎంపీ తులిప్‍ సిద్దిఖ్‍ కూడా పాల్గొన్నారు. మామూలు సమయంలో అయితే ఇందులో పెద్ద విశేషం  ఉండేది కాదు. ఆమె నెలలు నిండిన గర్భవతి. నడవలేని స్థితిలో, వీల్‍చైర్ లో కూర్చుని ఓటింగ్‍ కోసం ఎదురుచూశారు. సిజేరియన్‍ ఆపరేషన్‍ వాయిదా వేసుకుని మరీ వెయిట్ చేశారు.

కాలం చెల్లిన చట్టాలు..
హాంప్‍స్టీడ్‍, కిల్‍బర్న్ నియోజకవర్గ ఎంపీ అయిన తులిప్ సిద్దిఖ్‍ జనవరి 16న ఓటింగ్‍లో పాల్గొనేందుకు సభకు వచ్చారు. నడవలేని స్థితిలో నిండుగర్భిని అయిన ఆమె ఓటువేయడానికి చాలా సేపు వేట్ చేశారు.  ఇందుకు 19వ శతాబ్దపు, కాలం చెల్లిన చట్టాలే కారణం.

బ్రిటన్‍ చట్టాల ప్రకారం పార్లమెంట్‍లో ఓటింగ్ జరుగుతున్న సమయంలో ఎంపీ ప్రత్యక్షంగానే ఓటు వేయాలి. ప్రతినిధి ద్వారా వేసేందుకు వీలు లేదు. ప్రాక్సీ ఓటింగ్‍ (తనకు బదులుగా ఇంకొకరి ద్వారా ఓటు వేసే వెసులుబాటు) నిబంధన బ్రిటన్‍ పార్లమెంటు లో లేదు. సభకు రాకున్నా , ఓటింగ్‍లో పాల్గొనకున్నా ‘గైర్హాజరు’గా లెక్కిస్తారు. దీంతో తులిప్ సిద్దిఖ్‍ తన గొంతు వినిపించేందుకు డెలివరీ టైమ్ లోనూ  సభకు వచ్చారు. 19 శతాబ్దంలో పురుషులు ఎక్కువ ఉన్న సమయంలో తీసుకొచ్చిన నిబంధన ఇది. దీన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. పాత చట్టాలను మార్చాలని, ప్రాక్సీ ఓటింగ్‍ను అమల్లోకి తీసుకురావాలని ఏళ్లుగా చర్చ నడుస్తున్నా, దాన్ని అమలు చేసే చర్యలు మాత్రం ముందుకు సాగడం లేదు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy