UPలో ఘోరం: బస్సుకు నిప్పంటుకుని నలుగురు మృతి

UP-FIRINGఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బాందా జిల్లా జస్పుర దగ్గర ప్రయాణిస్తున్న బస్సుపై హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడటంతో బస్సుకి నిప్పంటుకుంది. అనుకోని ప్రమాదంతో బస్సు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి రోడ్డుపక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు చనిపోగా మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని బస్సులోంచి బయటకు తీసిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. శనివారం (మే 20) ఉదయం 9:30 గంటలకి జరిగిన ఈ ప్రమాదానికిగల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు సంబంధిత అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy