US ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ : టైటిల్ గెలిచిన ప్రణయ్

TH24-BAD-INDIAGKU25DJ7V3jpgjpgభారత షట్లర్‌ HS ప్రణయ్‌ మరో టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. US ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో విజేతగా నిలిచాడు. హోరాహోరీ సాగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రణయ్ 21-15, 20-22, 21-12తో హైదరాబాదీ స్టార్‌ పారుపల్లి కశ్యప్‌పై విజయం సాధించాడు. తొలి గేమ్‌ ఆరంభంలో కశ్యప్‌ 7-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచాడు. అయితే పుంజుకున్న ప్రణయ్‌.. వరుసగా ఐదు పాయింట్లు గెలిచి కశ్యప్‌ స్కోరును సమీపించాడు.

ఆపై 15-15తో స్కోరు సమమైంది. ఆ తర్వాత విజృంభించి ఆడిన ప్రణయ్‌ను అడ్డుకోవడం కశ్యప్‌ వల్ల కాలేదు. వరుసగా ఆరు పాయింట్లు సాధించిన ప్రణయ్‌.. 21-15తో తొలి గేమ్‌ చేజిక్కించుకున్నాడు. రెండో గేమ్‌ హోరాహోరీగా సాగింది. ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. కశ్యప్‌ 14-9తో ఒక దశలో ఆధిక్యంలో నిలిచినా.. పుంజుకున్న ప్రణయ్‌ స్కోరు సమం చేశాడు. కానీ పట్టువదలని కశ్యప్‌ కీలక సమయంలో రెండు పాయింట్లు సాధించి 22-20తో గేమ్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రణయ్‌ 13-7తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరును కొనసాగించి గేమ్‌తో పాటు టైటిల్‌ కూడా సొంతం చేసుకున్నాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy