V2@F2 : జూన్ నుంచి నవ్వులే నవ్వులు

F2మల్టీస్టారర్ సినిమాలు తీయడంలో ముందుండే విక్టరీ వెంటకటేష్ లేటెస్ట్ గా వరుణ్ తేజ్ తో ఓ మల్టీస్టారర్ చేస్తున్న విషయం తెలిసిందే.  అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ఎఫ్ 2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) అనే టైటిల్ ను అనౌన్స్ చేసిన యూనిట్.. త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. వెంకీ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. వరుణ్‌ కూడా సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో స్పేస్‌ ఆధారంగా తెరకెక్కబోయే సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాలు సెట్స్‌ మీద ఉండగానే అనిల్‌ డైరెక్షన్ లో ఎఫ్‌ 2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) సినిమాను కూడా ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు ఈ ఇద్దరు హీరోలు. ఎఫ్‌ 2 షూటింగ్ జూన్‌ లో ప్రారంభిస్తున్నట్టుగా ఆదివారం (ఏప్రిల్-15) ట్విట్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది యూనిట్. ఈ సందర్భంగా వెంకీ, వరుణ్ లకు సంబంధించిన ఓ ఫోటోను పోస్ట్ చేశారు.  ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy