V6 సంక్రాంతి పల్లె పాట -2019

తెలుగు లోగిళ్లలో మూడురోజులు జరుపుకునే పండుగ సంక్రాంతి. పుష్యమాసంలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే కాలాన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. భోగి మంటల వెలుగులతో.. ముచ్చటైన ముగ్గులతో, హరి దాసుల కీర్తనలతో సంక్రాంతి నిండుకుంది. ఇటు పిల్లల పతంగులు, అటు పెద్దల కోడి పందేలు, మరో పక్క పిండివంటలతో సంతోషకరవాతావరణాన్ని తీసుకొచ్చింది సంక్రాంతి. ప్రతీ సంవత్సరంలా ఈ సంక్రాంతికి కూడా మీ ఇల్లు ఆనందాల నెలవు అవ్వాలని కోరుకుంటోంది V6.

పల్లవి: సంక్రాంతి భగ భగ మండే బోగిమంటల
సిరి వెలుగుల రాత్రి
సంక్రాతి ధగధగ మెరిసే దాన్యపు రాసుల అందించెను ధాత్రి
గల గల కనుమల రాగమే
ఇక నవ్వెను మన రైతాంగమే
రంగవల్లుల రంగులే
గగనాలలో గాలి పటములే
పదముపాడగ హరిదాసులే
కదము తొక్కగ గంగిరెద్దులే
మకరరాశిలో సూర్యుడు చేరగ
సంక్రాంతి అడుగేసి మెరిసే
సంక్రాంతి భగ భగ మండే బోగిమంటల
సిరి వెలుగుల రాత్రి
సంక్రాతి ధగధగ మెరిసే దాన్యపు రాసుల అందించెను ధాత్రి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy