స్వతంత్ర భారతంలో మొదటిసారి… వారణాసి జలమార్గం ప్రారంభించిన ప్రధాని మోడీ

వారనాసి :  దేశంలోనే మొదటి సారి ‘ఇన్ లాండ్ వాటర్ వేస్ టర్మినల్’ ను సోమవారం వారనాసిలో ప్రధాని మోడీ ప్రారంభించారు. గంగా నదిపై నిర్మించనున్న నాలుగు మల్టీ మోడల్ టెర్మినల్స్‌లో ఇదొకటి.  ఈ టెర్మినల్ ను జాతికి అంకితం ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా.. వారణాసి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా వరకు గంగా నదిపై జల మార్గాన్ని అభివృద్ధి చేశారు. 1,500 నుంచి 2,000 టన్నుల బరువుగల భారీ నౌకల ప్రయాణానికి అనువుగా ఈ టెర్మినల్ ను నిర్మించారు.

ఈ ప్రాజెక్టును ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది. ప్రస్తుతం వారణాసిలో మొదటి జల మార్గం ఏర్పాటుకాగా, షహిబ్ గంజ్, హల్దియా, ఘాజీపూర్ లో కూడా జలమార్గాలు రూపుదిద్దుకోనున్నాయి.  జల మార్గ్ వికాస్ ప్రాజెక్టులో భాగంగా ఈ టెర్మినల్స్  ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు ప్రపంచ బ్యాంక్ నిధులు సమకూర్చింది. సరుకు రవాణా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రోడ్డు రవాణా, రహదారుల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  హాజరయ్యారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy