‘ఐస్ క్రీమ్’ రుచి చూపించేందుకు వర్మ రెడీ..

రామ్ గోపాల్ వర్మ ‘ఐస్ క్రీమ్’ రుచి చూపిస్తానంటున్నాడు. హర్రర్, టెర్రర్, రౌడీయిజమే కాకుండా.. రొమాంటిక్ సినిమాలతో కూడా పిచ్చెక్కిస్తానని అంటున్నారు. వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఐస్ క్రీమ్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయ్యింది. నవదీప్, తేజస్వీ జంటగా నటిస్తున్న ఈ సినిమా భీమవరం టాకీస్ బ్యానర్ పై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం వర్మ మరో కొత్త టెక్నాలజీని నమ్ముకున్నారు. ఆసియాలోనే తొలిసారిగా ‘ఫ్లో క్యామ్’ టెక్నాలజీని వర్మ ఉపయోగిస్తున్నారు. ఫ్లో క్యామ్ టెక్నాలజీ వల్ల ఫ్యూచర్ లో మేకింగ్ విధానమే మారిపోతుందని వర్మ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫ్లో క్యామ్ షాట్స్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. గతంలో కూడా వర్మ ఇలాంటి టెక్నాలజీ వాడి ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. నాగార్జున నటించిన ‘శివ’ సినిమా కోసం ‘స్టడీ క్యామ్’ ను వాడి టాలీవుడ్ లోనే కొత్త మార్పులు తీసుకొచ్చారు.

‘ఐస్ క్రీమ్’ సినిమా స్టిల్స్..

IMG_7342 IMG_7693 IMG_7692 IMG_7681 IMG_7636 IMG_7623 IMG_7600 IMG_7558 IMG_7555 IMG_7538 IMG_7529 IMG_7497 IMG_7468 IMG_7458 IMG_7454 IMG_7428 IMG_7389 IMG_7385 IMG_7353

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy