ఆమెకు మగవాళ్ల మాటలు వినబడవు.. యువతికి వింత జబ్బు

ఎవరికైనా ఒకసారి చెవుడు వచ్చిందటే.. ఎలాంటి శబ్ధమైనా వినబడదు.. అంతేకదా.. అందులో అనుమానం ఏముంది అనుకుంటున్నారా? కానీ, చైనాకు చెందిన ఓ యువతి మాత్రం వింత జబ్బుతో ఆసుపత్రిలో చేరింది. ఆమెకు చెవుడు వచ్చింది. కానీ మగవాళ్ల మాటలు మాత్రమే వినబడవు. ఆడవాళ్లు ఏం మాట్లాడినా బ్రహ్మాండంగా వినబడుతుంది.

ఆమె పేరు చెన్.. చైనాలోని షియామెన్ నగరంలో ఉంటోంది. ఆమె శుక్రవారం రాత్రి పడుకునే ముందు చెవిలో ఏదో ‘కీ’ అని మోత వినబడసాగింది. అదేముందిలే అననుకుని నిద్ర పోయింది. తెల్లవారాక బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడాలని ఫోన్ చేస్తే అతడి మాటలు వినిపించలేదు. దీంతో దగ్గరలోని ENT హాస్పిటల్ కు వెళ్లింది. వింతేంటంటే ఆమెకు అక్కడ లేడీ డాక్టర్ మాటలు బాగానే వినిపిస్తున్నాయి. ఓ వెంటనే ఓ మగ పేషెంట్ లోపలి రాగా అతడి మాటలు ఆమె చెవిని దాటి లోపలికి వెళ్లలేదు. దీంతో ముందు డాక్టర్ లిన్ షాక్ తిన్నారు. ఆనక చెన్ కు డాక్టర్ ధైర్యం చెప్పారు. ఆమె నైట్ డ్యూటీలు చేస్తున్నందున ఒత్తిడితో ఇలా జరిగి ఉండొచ్చన్నారు. ఇలాంటి వారికి ఆడవారి గొంతు హైఫ్రీక్వెన్సీలో ఉండడం వల్ల వినబడుతాయని లిన్ చెప్పారు. మగవాళ్ల గొంతు లోఫ్రీక్వెన్సీలో ఉంటాయన్నారు. పూర్తిగా నయం చేస్తానని ఆమెకు డాక్టర్ ధైర్యం చెప్పారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy