Wonders of the Brain: spot light

brain

Brain Research-Spotlight
ఎవరైనా షార్ప్ గా ఉంటే… వీడి బుర్రే బుర్ర అంటాం. ఎందుకంటే… జంతువులకు, మనిషికి అసలు తేడా అదే కాబట్టి. మనిషి బుర్రతోనే కొత్త ప్రపంచం పుట్టింది. అది ఇప్పటికీ అద్భుతాలు చేస్తూనే ఉంది. మనిషి తన బుర్రతో చాలా తెలుసుకున్నాడు. కానీ ఇప్పుడో కొత్త ప్రయత్నం చేస్తున్నాడు. తన బుర్రను తనే పరిశోదిస్తున్నాడు. శతాబ్దాలుగా తనకే తెలియకుండా… తన మెదడులోనే దాగిన రహస్యాల గుట్టువిప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఈ మహా ప్రయత్నంలో పెద్ద ముందడుగు కూడా వేశాడు. దాని పేరే బ్లూ బ్రెయిన్ ప్రాజెక్ట్. దీనిపై V6 స్పాట్ లైట్.

మనిషి… సృష్టిలో ఏ ప్రాణికీ లేనన్న అవకాశాలు తన సొంతం. అద్భుతాలకే అద్భుతాలు చేయగల టాలెంట్ అతడి సొంతం.  దేవుడు మనసుపెట్టి సృష్టించినట్టుంటుంది అతని వ్యవహారం. ప్రకృతిలో ఎన్నో ప్రాణులున్నాయి. కానీ ఏ ప్రాణికీ లేని విచక్షణ, విలక్షణ మనిషి సొంతం.

భూమ్మీద మిగతా ప్రాణులతో మనిషిని కంప్లీట్ గా వేరుచేసింది మెదడు. అది ఆలోచించడం మొదలుపెట్టడమే కాదు… మనిషికి విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించడమే కాదు విచక్షణను అందిస్తోంది. అందుకే బుర్రకు అంత వ్యాల్యూ. మైండ్ పై మన మధ్య ఎన్నో సెటైర్లు పేలుతుంటాయి. తలను చూపించి ఇది కాస్త వాడు అంటుంటారు. తెలివి తక్కువగా బిహేవ్ చేస్తే… కాస్త బుర్రపెట్టు అంటుంటారు. విచక్షణ కోల్పోతే బుర్రపనిచేయట్లేదా అని తిట్టేస్తారు. పక్కవాడి మైండ్ తో మ్యాచ్ కాకపోతే ఎక్కడైనా కిలో గుజ్జుంటే కొనుక్కుని బుర్రలో పెట్టుకో అని సలహా ఇస్తుంటారు. ఇవి చాలవా… మైండ్ వ్యాల్యూ ఏంటో చెప్పడానికి.

మనిషి తెలివితేటల్ని బీట్ చేసేలా కంప్యూటర్ బ్రెయిన్స్ ని తయారుచేశారు. ఇపుడు రోబోలకు ఆర్టిఫిషియల్ బ్రెయిన్ ను ఫిక్స్ చేస్తున్నారు. గతంలో ఐబీఎం సూపర్ కంప్యూటర్ ని తయారుచేసింది. డీప్ బ్లూ పేరున్న ఈ కంప్యూటర్ తో తలపడ్డ చెస్ ఛాంపియన్ గ్యారీ క్యాస్పరోవ్ ఓడిపోయాడు. అప్పటిదాకా మనిషి మైండ్ కు తిరుగులేదనుకున్నవాళ్లకు డీప్ బ్లూ షాకిచ్చింది. దాంతో మనిషి తన బుర్రకు మరింత పదునుపెట్టాడు. అసలు మన బుర్రలో ఏముంది. దాన్ని ఎలా విశ్లేషించాలని అన్వేషించడం మొదలుపెట్టాడు. ఇప్పటికే ఎలుక బ్రెయిన్ పై చేసిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయి. అదిచ్చిన స్ఫూర్తితో ఇపుడు మనిషి మెదడును క్యాలిక్యులేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు సైంటిస్టులు.

10 వేల కోట్ల న్యూరాన్స్. బ్రెయిన్ కు కనెక్ట్ అయిన కోట్లాది సెల్స్. కోపమొచ్చినా, బాధేసినా, ఏం జరిగినా క్షణాల్లో రియాక్షన్స్. కోటి కోట్ల మెసేజ్ లను సెకన్ లో నిక్షిప్తం చేసుకునే వ్యవస్థ. సూపర్ కంప్యూటర్ కన్నా సూపర్ ఫాస్ట్ గా పనిచేసే స్ట్రెంత్. ఇదంతా హ్యూమన్ బ్రెయిన్ కుండే స్ట్రెంత్. బాడీలో ఎక్కడేం జరిగినా క్షణాల్లో స్పందించే సిస్టెమ్ మన మైండ్. సాఫ్ట్ వేర్ భాషలో చెప్పాలంటే… బాడీని నియంత్రించే హార్డ్ డిస్క్… బ్రెయిన్.

మనిషి తల… సైజును బట్టి ఐదు కేజీలకు పైనే ఉంటుంది. అందులో బుర్ర సైజు… 12 వందల గ్రాముల నుంచి 14 వందల గ్రాములుంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డ మెదడు 300 నుంచి 450 గ్రాముల మధ్య ఉంటుంది.
బుర్ర సైజు ఎంత వెయిటుంటే అంత తెలివి ఉన్నట్టు చెబుతుంటారు. కానీ అది శుద్ధ అబద్ధం అని నిరూపించారు సైంటిస్టులు. దానికి ఎగ్జాంపుల్ ఐన్ స్టీన్ బ్రెయిన్. ఐన్ స్టీన్ ఐక్యూని కాలిక్యులేట్ చేసే క్రమంలో ఆయన బ్రెయిన్ పై పరిశోధనలు చేశారు సైంటిస్టులు. ఆయన బ్రెయిన్ వెయిట్ ఎంతో తెలుసా. కేవలం 1230 గ్రాములు.

einstein

ఐన్ స్టీన్ బ్రెయిన్ వెయిట్ ను చూసి సైంటిస్టుల షాకయ్యారు. బుర్ర వెయిట్ తక్కువున్న ఐన్ స్టీన్ నాలెడ్జ్ అంత ఎక్కువ ఉండటం వెనుక రహస్యాన్ని చేధించేందుకు ప్రయత్నించారు పరిశోధకులు. 1955లో ఐన్ స్టీన్ చనిపోయాక ఆయన మెదడును వేరు చేశారు. దాదాపు మూడేళ్ల పాటు దానిపై పరిశోధనలు చేశారు. బ్రెయిన్ కు బ్లడ్ ను సప్లై చేసే కెరాటిడ్ నెర్వ్స్ నుంచి 10 శాతం ఫార్మలిన్ లిక్విడ్ ను పంపించారు. బ్రెయిన్ మొత్తాన్ని 1 ఘనపరిమాణపు ముక్కలుగా కోసి పరీక్షించారు. వాటిని భవిష్యత్ పరిశోధనల కోసం సెల్లాయిడ్ మైనం పూసి స్టోర్ చేశారు.

బతికున్నంతకాలం ఎన్నో పరిశోధనలు చేసి… ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించిన ఐన్ స్టీన్ చనిపోయాక కూడా ఉపయోగపడ్డం విశేషం. మోడరన్ సైంటిస్టులకు ఆయన బ్రెయిన్ ఒక ఆయుధంగా మారిందనే చెప్పాలి. 1999లో కెనెడా మక్ మాస్టర్ యూనివర్సిటీకి చెందిన సాండ్రా విటిల్సన్ బృందం కొన్ని పరిశోధనలు చేసింది.  నార్మల్ మ్యాన్ కన్నా ఐన్ స్టీన్ బ్రెయిన్ లో పెరైటల్ లోబ్ 15 శాతం పెద్దదిగా ఉందని గమనించారు. మెమొరీ పవర్ కు, ఏదైనా సమాచారాన్ని క్రోడీకరించేందుకు బ్రెయిన్ లో ఇదే కీలకం. ఇక సెరెబ్రల్ కార్టెక్స్ అనే మరో పదార్థం కూడా మిగతా వాళ్ల కన్నా చాలా పలచగా ఉండటాన్ని గమనించారు. బ్రెయిన్ కు టై అప్ అయి ఉండే న్యూరాన్లకు ఇవే ప్రాణం పోస్తాయి. వాటితోపాటు గ్లియల్ సెల్స్(glial cells) అనేవి చాలా ఎక్కువగా ఉండటాన్ని గమనించారు. ఐన్ స్టీన్ బాడీలోని న్యూరాన్స్ చాలావరకు సెరెబ్రల్ కార్టెక్స్ తో ప్యాక్ అయ్యాయని గుర్తించారు. యూనివర్సిటీ అఫ్ క్యాలిఫోర్నియా ఐన్ స్టీన్ గ్లియల్ సెల్స్ ను పరిశీలించాక వాటికి విద్యుత్ చలనాలున్నాయని… న్యూరాన్ల కెమికల్ మెసేజ్ ను అర్థం చేసుకునే సామర్థ్యం వాటికుందని… స్పందించే గుణం కూడా ఎక్కువుంటుందని నిర్ధరించారు.

ఐన్ స్టీన్ మెదడుపై  పరిశోధనలు జరుగుతుండగానే బ్రెయిన్ మ్యాపింగ్ రీసెర్చ్ మొదలైంది. 1980ల్లో అమెరికా నేషనల్ అకాడమీ అఫ్ సైన్స్ అధ్వర్యంలో ఓ కమిషన్ వేశారు. మనిషి బ్రెయిన్ పనితీరును, స్పందించే తీరు, వయసు, రోగాలు, జ్ఞాపకశక్తిలాంటి అంశాలను తెలుసుకునేందుకు బ్రెయిన్ మ్యాపింగ్ ప్రాజెక్ట్ ను చేపట్టారు. దాని ద్వారా చాలా విషయాలు వెలుగు చూశాయి. అయినా మెదడు గురించి తెలుసుకుంది గోరంత… తెలియాల్సింది కొండంత అన్నట్టు తయారైంది పరిస్థితి.  ఎందుకంటే మనిషి మైండ్ పాలపుంత కన్నా సంక్లిష్టంగా ఉండటాన్ని గమనించారు. అదే ఫ్యూచర్ ప్రాజెక్ట్ లకు పునాదులేసింది.

ఐన్ స్టీన్ బ్రెయిన్ రీసెర్చ్ కొత్త పరిశోధనలకు ఊపిరిపోసింది. హ్యూమన్ బ్రెయిన్ ను విశ్లేషించేందుకు బూస్ట్ నిచ్చింది. అందుకే ఒబామా… బ్రెయిన్ యాక్టివిటీ మ్యాప్ ప్రాజెక్ట్ ను తెరపైకి తెచ్చారు. 300 కోట్ల డాలర్లతో పెద్ద యజ్ఞాన్నే మొదలుపెట్టారు ఒబామా. ఇంతకీ బ్రెయిన్ యాక్టివిటీ మ్యాప్ ప్రాజెక్ట్ ఏంటి? దీంతో ఏం సాధించాలనుకుంటున్నారు?

nerves

10 వేల కోట్ల న్యూరాన్లు
లక్షల కోట్ల మీటర్లు పొడవుండే నెర్వ్స్
బ్రెయిన్ తో టై అప్ అయిన బాడీ పార్ట్స్
ఒక్కో నెర్వ్ ది ఒక్కో ఫంక్షన్

హ్యూమన్ బ్రెయిన్ ఓ పెద్ద పజిల్. దాన్ని చేధిస్తే ప్రపంచంలో ఏ సమస్యనైనా ఇంకా ఈజీగా సాల్వ్ చెయ్యొచ్చు. ఒక్క బుర్రపై పరిశోధనను కంప్లీట్ చేస్తే ప్రపంచాన్ని జయించినట్టేనని అనుకుంటున్నారు సైంటిస్టులు. ఎందుకంటే గెలాక్సీ లోని విశేషాల కన్నా బ్రెయిన్ వండర్స్ ఎక్కువ మరి.

కాలికి దెబ్బ తగిలితే కళ్లల్లో నీళ్లొస్తాయి. ఎవరైనా హర్ట్ చేస్తే హార్ట్ బ్రేక్ అవుతుంది. నవ్విస్తే ఆనంద భాష్పాలు రాలతాయి. ఆకలేస్తే తినాలన్న కోరిక పుట్టించేది మైండే. నిద్రొస్తే కునుకుతీయాలని సంకేతాలిచ్చేది మైండే. సెన్సిటివిటీ, ఎమోషన్స్, రియాక్షన్స్, సెన్సేషన్స్ అన్నిటికీ మూలం మైండ్. ఒక్కమాటలో చెప్పాలంటే మనిషిని ఆటాడించే ఒకే ఒక్క పార్ట్ బ్రెయిన్.

న్యూరాలజీకి సంబంధించిన ఎన్నో అంశాల్లో మన అవగాహన అంతంతమాత్రమే. నాడీ కణాల చర్యల్లో సమాచారం ఎలా ఒదిగిపోతుంది… అవి మెమొరీని ఎలా నిల్వ చేసుకుంటాయి.. అవసరమైనపుడు సమాచారం ఎలా బయటకొస్తుంది… ఫ్యూచర్ ను మెదడు ఎలా ఊహిస్తుంది లాంటి అంశాలను గుర్తించేందుకే బ్రెయిన్ యాక్టివిటీ మ్యాప్ ప్రాజెక్ట్. అంతేకాదు సెన్సాఫ్ హ్యూమర్, సెన్సేషన్స్, రియాక్షన్స్ లాంటివన్నీ కనుగొనేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడుతుందని ఊహిస్తున్నారు సైంటిస్టులు. అన్నిటికి మించి బ్రెయిన్ లోని ప్రత్యేక వ్యవస్థలు ఒకదాంతో మరోటి ఎలా లింక్ అవుతాయి అని తెలుసుకోవడం మరింత ఈజీ అవుతుంది.

ఈ ప్రాజెక్ట్ కోసం అమెరికా ఏకంగా 3 బిలియన్ డాలర్స్ ను కేటాయించింది. మన కరెన్సీలో చెప్పాలంటే… 16 వేల 284 కోట్లు. దీనితో ఎన్నో ప్రయోజనాలను ఆశిస్తోంది ప్రపంచం. ఈ ప్రాజెక్ట్ గనక సక్సెస్ అయితే… ఆల్జీమర్స్, పార్కిన్సన్ లాంటి వ్యాధులకు చెక్ పెట్టే అవకాశముంటుంది. బాడీకి కొరకరాని కొయ్యలుగా మారే ఎలాంటి వ్యాధినైనా కంట్రోల్ చేసే అవకాశముంటుంది. మందబుద్ధి, గుడ్డితనం, చెవిటితనం లాంటి దీర్ఘకాలిక రోగాలకూ చెక్ పెట్టే ఛాన్సుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే బాడీకి షాకిచ్చే ప్రతీ ట్రబుల్ కు బ్రెయిన్ తో చెక్ పెట్టొచ్చన్నమాట.

నిజానికి ఈ ప్రాజెక్ట్ అమెరికా స్వార్థం కోసం చేస్తుందన్న విమర్శలున్నాయి. 1950ల్లో యూకే ఆల్ట్రా పేరుతో మైండ్ మ్యానిప్యులేట్ ప్రాజెక్ట్ ను చేపట్టింది అమెరికా. యుద్ధరంగంలోని నిపుణుల మైండ్ ని మ్యానిప్యులేట్ చేసి శత్రుదేశాలను దెబ్బతీయాలన్నది ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. 20 ఏళ్ల పాటు సీఐఏ అధ్వర్యంలో సీక్రెట్ గా ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ మ్యాటర్ లీకవడంతో అభాసుపాలైంది. మైండ్ హిప్నాటిజంను పక్కనపెట్టేసింది. అలాంటిదే ఒబామా బ్రెయిన్ యాక్టివిటీ మ్యాప్ ప్రాజెక్ట్ అన్న విమర్శలున్నాయి. కానీ ఇది ప్రపంచానికే దిశానిర్దేశం చేయబోయే ప్రాజెక్ట్ గా చెప్పుకొస్తున్నారు సైంటిస్టులు.

మనిషి శరీరం అద్భుతమైన మెషీన్. అందులో బ్రెయిన్ ది కీ రోల్. పుట్టిన మనిషి చచ్చేదాకా బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది. ఆఖరికి కోమాలోకెళ్లినా బుర్ర మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. ఇది నిజం. అలాంటి మనిషి… పరిణామంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాడు. వాటిని దాటి ముందుకొచ్చాడు. హ్యూమన్ బాడీపై జరిగిన కొన్ని పరిశోధనలను చూద్దాం.

అకస్మాత్తుగా కంపనాలతో నిలువెల్లా వణికిస్తూ కుప్పకూలిపోయేలా చేసేవి ఫిట్స్. ఏం చేస్తున్నామో.. ఎటుపోతున్నామో తెలుసుకోలేనంతగా తికమకపెట్టేది మతిమరుపు. తీరికలేకుండా పనిచేసుకునేవాళ్లను హఠాత్తుగా మంచాన పడేసేది పక్షపాతం. ఇవన్నీ ఎలా వస్తాయో తెలుసా. మెదడుకు తగిలే చిన్న చిన్న గాయాల కారణంగా. అప్పుడప్పుడూ ఎదురయ్యే లోపాలతో వచ్చే రోగాలివి.

ఇవే కాదు డిస్లెక్సియా, డిమెన్షియా.. బ్రెయిన్ ట్యూమర్స్ లాంటి మరికొన్ని భయంకర వ్యాధులూ బుర్రను హీటెక్కిస్తుంటాయి. బాడీలోని ఏ పార్ట్ కి ప్రమాదం ముంచుకొచ్చిన నయం చేసే చికిత్సలొచ్చాయి. కానీ మెదడుకు ఏమైనా జరిగితే మాత్రం నో ఆల్టర్నేటివ్స్. కారణం ఇప్పటిదాకా బ్రెయిన్ ను టచ్ చేసేటట్టు పరిశోధనలు జరగలేదు కాబట్టి. ఇలాంటివాటికి ఇప్పటికే కొన్ని పరిష్కారాలు కనుగొన్నారు సైంటిస్టులు. కృత్రిమ చికిత్సలతో ప్రమాదాన్ని కొంతవరకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ భరోసా ఇచ్చేలా వైద్యసేవలు మాత్రం అందుబాటులోకి రాలేదనే చెప్పాలి.

పదేళ్ల క్రితం జీనోమ్ ప్రాజెక్ట్ తో ఎన్నో రోగాలను నయం చేసే వ్యవస్థను అభివృద్ధి చేశారు సైంటిస్టులు. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులకు జీనోమ్ ప్రాజెక్ట్ పరిష్కారం చూపించింది. జీన్స్ కు సోకే వైరస్ లు, బ్యాక్టీరియాలను కనుగొని వాటికి చికిత్స చేసేలా వైద్య వ్యవస్థ అందుబాటులోకొచ్చింది. జీనోమ్ లోని 23 జతల క్రోమోజోముల పనితీరును ఈ ప్రాజెక్ట్ విశ్లేషించింది. నిజానికి 1953లో వాట్సన్, క్రిక్ అనే ఇద్దరు సైంటిస్టులు జీనోమ్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. కానీ దానికి సమగ్ర రూపం రావడానికి 50 ఏళ్లు పట్టింది. 2003లో క్రేగ్ వెంటర్ అనే సైంటిస్ట్ జీనోమ్ ప్రాజెక్ట్ వివరాలను ప్రతిపాదించాడు.

జీనోమ్ ప్రాజెక్ట్, స్టెమ్స్ సెల్స్ ఆధారిత చికిత్సలతో మనిషికొచ్చే సమస్యలను చాలావరకు పరిష్కరించగలుగుతున్నారు సైంటిస్టులు. కానీ బ్రెయిన్ కు ఎదురయ్యే సవాళ్లను మాత్రం ఎదుర్కోలేకపోతున్నారు. ఆ సవాళ్లను స్వీకరించేందుకే బ్రెయిన్ యాక్టివిటీ మ్యాప్ ప్రాజెక్ట్.

ఇప్పటికే రోబోకు కృత్రిమ మెదడు పెట్టి ప్రయోగాలు చేశారు. అవి సక్సెస్ అయ్యాయి. ఎలుక మెదడుపైనా పరిశోధనలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది మైండ్ రీసెర్చ్. అది సక్సెస్ అయితే మనిషి… చావును జయించినా ఆశ్చర్యం లేదు. దీనికి మరో 20-30 ఏళ్లు టైం పడుతుందంటున్నారు సైంటిస్టులు. ఏదేమైనా మనిషికి సాధ్యం కానిది లేదని మళ్లీ రుజువు కాబోతోంది. బ్రెయిన్ రీసెర్చ్ సక్సెస్ కావాలని ఆశిద్దాం. 

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy