సూపర్ సోల్జర్.. జవాన్లు ఎగురుతూ వచ్చేస్తారు

ప్రపంచంలోనే తొలి ఎగిరే సోల్జర్‌ రెడీ

ఎక్కడో మారుమూల ప్రాంతం.. అనుకోకుండా ఓ ప్రమాదం జరుగుతుంది.. కాపాడేందుకు ఎవరూ ఉండరు. ఇంతలో ఓ సూపర్‌ సోల్జర్‌ ఎగురుకుంటూ వస్తాడు. వారిని కాపాడతాడు. హాలీవుడ్‌ సినిమాల్లో ఎక్కు వగా కనిపించే సీన్లు ఇవి. ఇకపై నిజంగానూ ఈ సీన్లు కనిపిస్తాయి. ప్రపంచంలోనే తొలి ఎగిరే సోల్జర్‌ రెడీ అయ్యాడు. 1,000 హార్స్‌ పవర్‌ ఇంజన్‌ కలిగిన రాకెట్‌ ఫ్యూయల్డ్‌ జెట్‌ ప్యాక్‌ తో గంటకు 30 మైళ్ల వేగంతో భూమికి 8 అడుగుల ఎత్తులో దూసుకుపోగలడు. బ్రిటన్‌ డెవాన్‌ లోని కమాండో ట్రైనింగ్‌ సెంటర్‌ రాయల్‌‌‌‌ మెరైన్‌లో సోల్జర్​ను ఎగిరించే మెషీన్లను టెస్టు చేశారు. రిచర్డ్‌ బ్రౌనింగ్‌ (39) గాల్లో ఎగిరిన తొలి సోల్జర్‌గా నిలిచాడు. కొద్ది క్షణాలపాటు ట్రైనింగ్​ సెంటర్​ గ్రౌండ్​లో రౌండ్‌ వేశాడతను. మెయిన్‌ ఇంజన్‌ తో పాటు ప్రతి చేతికీ రెండు మినీ జెట్‌ ఇంజన్లను అమర్చుకున్నాడు. చూసేందుకు కామిక్‌ సూపర్‌ హీరో ఐరన్‌ మ్యాన్‌ లా అనిపించాడు. జెట్‌ తో కిందికి దిగిన రిచర్డ్‌ ను మెరైన్‌ టీమ్‌ పెద్దాఫీసర్లు అభినందించారు. గత వారం జరిగిన ఈ ఈవెంట్‌ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్‌ లైన్‌ లో చక్కర్లు కొడుతోంది. స్పెషల్‌‌‌‌ ఫోర్సెస్‌ ఆపరేషన్ల కోసం దీనిని ఉపయోగించాలని బ్రిటన్‌ భావిస్తోంది.

ఎలా పనిచేస్తుంది…

రిచర్డ్‌ స్వయంగా దీన్ని కనుగొన్నాడు. టెస్ట్‌‌‌‌ చేసేందుకు డిఫెన్స్‌ చీఫ్స్‌ అతడికి అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం ఈ సూట్‌ తో 4 నుంచి 9 నిమిషాల పాటు ఎగరొచ్చు. టాప్‌ స్పీడ్‌ గంటకు 32 మైళ్లు. బరువు 26 కేజీలు. చెస్ట్‌‌‌‌పై ధరించే ఆర్మర్‌ లో ఇంజన్లను కంట్రోల్‌‌‌‌ చేసే ఎలక్ట్రానిక్‌ టెక్నాలజీని ఉంటుంది. ఓ ఫ్యూయల్‌‌‌‌ ట్యాంకర్‌ ఉంటుంది. అలాగే హోలోగ్రాఫిక్‌ డిస్‌ ప్లే సిస్టమ్‌ తో కూడిన ‘ఐరన్‌ మ్ యాన్‌’హెల్మెట్‌ లానే ఉంటుంది. ఈ సూట్‌ పూర్తిగా ఫైర్‌ ప్రూఫ్‌‌‌‌. చేతుల కదలికల ఆధారంగా గాలిలో ముందుకు కదులుతుంది. అమెరికా స్పెషల్‌‌‌‌ ఫోర్స్‌ నుంచి ఇప్పుడు అతడికి ఆఫర్లు వస్తున్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy